close
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం

నేడు ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగ సమస్యలపై సీఎస్‌కు వినతి
తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు రవీందర్‌రెడ్డి, మమత
ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామ, ఇతర నేతలు వారితో భేటీ
కలిసి పనిచేయాలని నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్‌

ర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్‌ అధికారులు, పింఛనర్ల ఐకాస ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి విన్నవిస్తామని వెల్లడించింది. ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు మంగళవారం టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ ఐకాస నేతలు కారెం రవీందర్‌రెడ్డి, మమత, సత్యనారాయణ, రాజేందర్‌, మణిపాల్‌రెడ్డి ఇతర నాయకులతో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమ్మెకు ఎందుకు వెళ్లామో ఆర్టీసీ నేతలు తెలిపారు. ఉద్యోగ ఐకాస నేతలపై తామేమీ విమర్శలు చేయలేదని వివరించారు. రవీందర్‌రెడ్డి, మమతలు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సీఎంను కలిస్తే అపవాదు వేయడం తమను బాధించిందని పేర్కొన్నారు. చర్చల అనంతరం వీరు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ గురించి చర్చించారు. సమావేశం అనంతరం వివరాలను వెల్లడించారు.

ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణ ఉద్యమం టీజీవోలు, టీఎన్జీవోలు కీలకపాత్ర పోషించారు. వారికి రుణపడి ఉంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ తిరోగమనంలో ఉంది. ఒక్క కొత్త బస్సు కొనలేదు. ఏడువేల మంది పదవీ విరమణ పొందారు. కొత్త నియామకాల్లేవు. రూ.1400 కోట్ల పీఎఫ్‌ సొమ్మును యాజమాన్యం వాడుకుంది. ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీసిచ్చాం. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. టీజీవోలు, టీఎన్జీవోలు స్పందించకపోవడంపై బాధతో మాట్లాడాం. ఈ రోజు వాళ్ల మద్దతు కోరాం’’ అని తెలిపారు.

ఉద్యోగ ఐకాస నేత కారెం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఆర్టీసీ ఐకాసకి మద్దతు ఇస్తున్నాం. కార్మికుల ఆత్మహత్యలు చాలా బాధించాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ను వచ్చింది. తర్వాత 16 శాతం ఐఆర్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా ఐఆర్‌ ఇవ్వలేదు. దీనిపై మేం సీఎంను కలిస్తే దుష్ప్రచారం చేయడంపై బాధపడ్డాం. ఆర్టీసీ ఐకాస నేతలు కలిసి మద్దతు కోరారు. మా కార్యవర్గ సమావేశంలో కార్మికుల సమస్యలను చర్చించి, వారికి అండగా నిలవాలని నిర్ణయించాం. బుధవారం ఐకాసలోని అన్ని సంఘాలతో సమావేశమవుతాం. అనంతరం సీఎస్‌ని కలిసి ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరతాం. ఆర్టీసీ సమ్మె కొనసాగితే మేమూ భాగస్వాములమవుతాం. రేపు కార్యాచరణ ప్రకటిస్తాం’’ అన్నారు. మమత మాట్లాడుతూ ‘‘ఆర్టీసీ కార్మికులకు మా సహకారం ఉంటుంది. కార్మికుల కార్యాచరణలో పాల్గొంటాం. ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి’’ అన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.