
యూనిఫారాలు, రక్షణ సామగ్రి పంపిణీ
వారంలోగా ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళికలు
డంప్‌యార్డుల కోసం భూసేకరణ
కలెక్టర్లతో సమీక్షలో పురపాలక మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: గ్రామ పంచాయతీలతో పాటు తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలలోని సిబ్బందికి సైతం బీమా పథకాన్ని అమలుచేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి యూనిఫాంతో పాటు రక్షణ సామగ్రిని సమకూరుస్తామన్నారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పించేందుకు ఏజెన్సీలను ఆదేశిస్తామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల మాదిరే అన్ని నగరాలు, పట్టణాల్లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వాటికి వారంలోగా ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెత్తసేకరణ నుంచి రీసైక్లింగ్, పచ్చదనం వరకు అన్ని వివరాలు ఇందులో ఉండాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ శ్రీదేవి, జలమండలి ఎండీ దానకిశోర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ ప్రతి పట్టణానికి అవసరాల మేరకు డంప్‌యార్డ్ ఉండాలి. లేనిచోట దానికోసం వెంటనే స్థలసేకరణ జరగాలి. పొడి, తడి చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి పట్టణంలో అవసరాల మేరకు మరుగుదొడ్లు నిర్మించి సజావుగా నిర్వహించాలి. ప్రతి నగరంలో మహిళల కోసం షీ-టాయిలెట్లను ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. దీనిపై యజమాన్యాలకు స్సష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. వరంగల్, సిరిసిల్లలో మాదిరి ప్రతి పట్టణంలో మానవవ్యర్థాల శుద్ధి ప్లాంట్లను చేపట్టాలి. పట్టణాల్లో తాగునీటి వనరుల గణన (ఆడిటింగు) జరగాలి. నీటివృథాను అరికట్టాలి. నూతన పురపాలక చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలి. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు విధిగా పురపాలిక బడ్జెట్లో 10శాతం కేటాయించాలి. పతి పట్టణంలో నర్సరీ ఉండాలి. ప్రతీ చోటా పెద్ద పార్కులను ఏర్పాటుచేయాలి’’ అన్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం