
అలాంటిదేమీ లేదన్న మాజీ కెప్టెన్
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ భాజపాలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌షాను ఈ నెల 12న ఆయన కలిసినప్పటి నుంచి ప్రసార మాధ్యమాల్లో ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి. 2021లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున సీఎం అభ్యర్థిగా ఆయన్ని నిలపడానికే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇచ్చారనేది వాటి సారాంశం. గంగూలీ మాత్రం వీటిని తోసిపుచ్చారు. ‘‘ప్రస్తుతానికి’’ అలాంటి రాజకీయ పరిణామాలేవీ లేవని మంగళవారం కోల్‌కతాలో విలేకరులకు చెప్పారు. అమిత్ షాతో తన భేటీలో అలాంటి చర్చ ఏదీ రాలేదని స్పష్టంచేశారు.
ముఖ్యాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!