
సంయుక్తంగా వరించిన ప్రతిష్ఠాత్మక ఆంగ్ల సాహితీ పురస్కారం
లండన్: ఆంగ్ల సాహితీవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాది (2019) కెనడా రచయిత్రి మార్గరెట్ ఎట్వుడ్, బ్రిటిష్ రచయిత్రి బెర్నర్‌డైన్ ఎవరిస్టోలు సంయుక్తంగా గెలుచుకున్నారు. 79 ఏళ్ల ఎట్వుడ్ను రెండోసారి ఈ బహుమతి వరించగా, బుకర్‌ప్రైజ్ గెలుచుకున్న తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో (60) చరిత్ర సృష్టించారు. ఎట్వుడ్ రాసిన ‘ద టెస్టమెంట్’, ఎవరిస్టో రాసిన ‘గర్ల్, ఉమన్, అదర్’ నవలలు ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి. మంగళవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ అవార్డును అందుకున్నారు. 50,000 పౌండ్ల (సుమారు రూ.45 లక్షల) బహుమతిని వీరిద్దరూ పంచుకోనున్నారు.
గతంలో తన ‘మిడ్నైట్ చిల్డ్రన్’కు బుకర్ ప్రైజ్ అందుకున్న ప్రఖ్యాత బ్రిటిష్-ఇండియన్ రచయిత సల్మాన్ రష్దీ... ఈసారి కొద్దిపాటిలో బహుమతికి దూరమయ్యారు. ఆయన రాసిన ‘క్విచాట్’ నవల ఆరు పుస్తకాల తుది జాబితాలో చోటు దక్కించుకున్నా, అవార్డుకు మాత్రం ఎంపిక కాలేదు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ