
ఇమ్రాన్ వ్యాఖ్యలతో శాంతికి విఘాతం
ట్రంప్‌తో ప్రధాని మోదీ
అరగంట పాటు ఫోన్లో సంభాషణ
ఈ ప్రాంతంలోని కొందరు నేతలు భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా హింసను ప్రేరేపించడం శాంతికి ఏ మాత్రం దోహదపడదు |
దిల్లీ: భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధోరణిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మోదీ సోమవారం ఫోన్లో ట్రంప్‌తో సంభాషించారు. జమ్మూ-కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక వీరిరువురి మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్ర విధ్వంసానికి తావులేని వాతావరణాన్ని ఏర్పర్చాల్సిన ఆవశ్యకతను కూడా మోదీ ప్రస్తావించారు. ఈ మార్గాన్ని అనుసరించేవారితో కలసి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై భారత్ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు. సోమవారం అఫ్గానిస్థాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవమని పేర్కొంటూ ఆ దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, స్వతంత్రతకు కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. జూన్‌లో ఒసాకాలో జరిగిన జి-20 సదస్సులో ట్రంప్‌తో సాగించిన చర్చలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై రెండు దేశాల మధ్య త్వరలోనే అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు అనేకం చర్చకు వచ్చినట్లు వివరించింది. ఇద్దరు నేతల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలకు ఈ సంభాషణ నిదర్శనమని పేర్కొంది. రెండు రోజుల కిందట ట్రంప్ ఇమ్రాన్‌కు ఫోన్ చేసిన నేపథ్యంలో తాజా సంభాషణకు ప్రాధాన్యం ఏర్పడింది. కశ్మీర్ అంశాన్ని భారత్‌తో కలసి ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి ట్రంప్ సూచించారు.
ఈ సందర్భంగా భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మోదీతో ట్రంప్ చర్చించినట్లు ‘వైట్‌హౌస్’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని, ఈ ప్రాంతంలో శాంతి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించినట్లు వివరించింది. వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పినట్లు పేర్కొంది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం