
బెంగళూరులో బెంబేలెత్తించిన కారు
అది బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ ప్రాంతం.. చల్లటి సాయం సమయం.. రహదారి పక్కన పాదచారుల బాటపై ఉన్న చిన్నపాటి హోటల్ వద్ద కొందరు వేడివేడి తేనీరు రుచి చూస్తున్నారు. మరికొందరు చిరుతిళ్లు తింటూ సరదాగా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.. ఇంతలో ఉన్నట్లుండి వారిపైకి దూసుకొచ్చిందో రాకాసి కారు.. ఒక్కసారిగా వారి వెన్నులో వణుకు పుట్టించింది. అనేకమందికి తప్పించుకునే అవకాశమూ లేకపోయింది. ఈ అనూహ్య ఘటనలో ఏడుగురు గాయపడగా, అందులో ముగ్గురి పరిస్థితి సోమవారం రాత్రి వరకు విషమంగానే ఉంది. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలూ ఉన్నారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ రాజేంద్ర(40)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆతను ఆదివారం సాయంత్రం పూటుగా తాగి రహదారిపైకి వచ్చాడని, జోరుగా కారు నడుపుతూ దానిపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
- న్యూస్‌టుడే, బెంగళూరు
ముఖ్యాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం