
మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం
ఈనాడు - హైదరాబాద్,
ఖైరతాబాద్ - న్యూస్‌టుడే
కేంద్ర ప్రభుత్వం అంటే చక్రవర్తులు కాదు.. రాష్ట్రాలు దానికి సామంత రాజ్యాలు కాదని వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం రూపాయి ఇచ్చింది లేదు కానీ భాజపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు విసిరిపోతున్నారన్నారు. వ్యవసాయ యంత్రాల వివరాలతో రైతులకు అవగాహన కల్పించేందుకు ‘రైతు మార్గదర్శి’ పేరుతో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(ఆగ్రోస్) రూపొందించిన పుస్తకాన్ని సోమవారం హరిత ప్లాజా హోటల్లో ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఆదివారం రాష్ట్రానికి వచ్చిన భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లారని, వారిని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. గతంలో భాజపాకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను పొగిడారని గుర్తు చేశారు. రూ.24 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించినా 24 రూపాయలైనా ఇవ్వడం చేతకాని వారు రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతుబంధు పథకం కింద 51 లక్షల మందికి డబ్బు ఇచ్చామన్నారు. మిగతావి కూడా త్వరలో రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. ఐదెకరాలకు పైగా భూమి ఉంటే రైతుబంధు సొమ్ము రాదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దానిని నమ్మవద్దని.. అందరికీ ఇస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఆగ్రోస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఎండీ సురేందర్‌లు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం