
ఉద్యోగ అవకాశాలు లేని ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టం: కేంద్రం
దిల్లీ: ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండే కోర్సులను ఇంజినీరింగ్ విద్యలో కొత్తగా అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం 2020-21 నుంచి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇలాంటి కోర్సులకు అనుమతించబోదని తెలిపింది. కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైన్ వంటి వర్ధమాన రంగాలకు సంబంధించిన విభాగాలకు మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సమాధానమిస్తూ.. ఇంజినీరింగ్ విద్యార్థులను భారత్‌లో తయారీ కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేస్తామన్నారు. పరిశ్రమ అవసరాలకు, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లోని కోర్సుల మధ్య అంతరాన్ని తొలగించేందుకు ఏఐసీటీఈ పలు చర్యల్ని తీసుకుంటోందని, విద్యార్థులకు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ అందులో భాగమేనని పేర్కొన్నారు. స్మార్ట్‌ఇండియా హాకథాన్లు నిర్వహిస్తామన్నారు. పరిశ్రమ డిమాండ్లకు, కోర్సులకు మధ్య అంతరాన్ని తొలగిస్తే, పకోడీలు అమ్ముకోవడం ద్వారా ఉద్యోగితను పొందవచ్చనే సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్యాపదేశంగా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రం విసిరారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- విచారణ ‘దిశ’గా...
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత