
వ్యాపారి రాంప్రసాద్ హత్యకు పథక రచన అతడిదే
ఊర శ్రీనివాస్‌ను బెదిరించే ఉద్దేశంతోనే ఘాతుకం
హైదరాబాద్ పోలీసుల వెల్లడి
ఈనాడు - హైదరాబాద్
విజయవాడకు చెందిన స్టీలు వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కుట్రదారు కోగంటి సత్యమేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. హత్యలో ముగ్గురు ప్రత్యక్షంగా పాల్గొనగా.. ప్రధాన నిందితుడు సత్యం సహా మొత్తం 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. సత్యం, అతని ప్రధాన అనుచరుడు శ్యామ్‌తో సహా హత్య చేసిన ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు బొలేరో వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం(60), అదే నగరానికి చెందిన తెలపోలు రాంప్రసాద్(48) భాగస్వామ్యంలో కామాక్షి స్టీలు సంస్థను నిర్వహించారు. ఇద్దరి మధ్య సుమారు రూ.70 కోట్ల లావాదేవీల్లో తేడాలొచ్చాయి. పలువురు పెద్దలు రూ.23 కోట్లను సత్యంకు రాంప్రసాద్ చెల్లించాలని తేల్చారు. ఆ డబ్బు ఇవ్వకపోవడంతో వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ఇదే విషయంలో కోగంటి సత్యంతో పాటు ఇతని ప్రధాన అనుచరుడు, విజయవాడకే చెందిన టెక్యం శ్యామ్‌సుందర్(50)పై రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ కేసు పెట్టాడు. శ్రీనివాస్ మరో రూ.12 కోట్లు చెల్లించాలని సత్యం బృందం ఆరోపిస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో రెండేళ్ల క్రితం రాంప్రసాద్ కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చాడు. ఖాజాగూడలో ఉంటూ పరిగిలో స్టీలు పరిశ్రమ ఏర్పాటు చేశాడు. పంజాగుట్టలో కార్యాలయాన్ని తెరిచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాంప్రసాద్‌ను అంతమొందించాలని సత్యం పథకాన్ని రచించాడు. రాంప్రసాద్‌ను చంపితే.. ఊర శ్రీనివాస్ భయపడి కనీసం రూ.12 కోట్లు ఇస్తాడనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు. ఈబాధ్యతను శ్యాంసుందర్‌కు అప్పగించాడు.
పథక రచన ఇలా..
ఈ హత్యకు గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరుకు చెందిన లేబర్ కాంట్రాక్టర్ పులివర్తి బాలనాగాంజనేయ ప్రసాద్(35)తో సత్యం, శ్యామ్‌లు సంప్రదింపులు జరిపారు. రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని.. ముందుగా రూ.2 లక్షలు చెల్లించారు. సత్యం తనవద్ద పనిచేసే తిరుపతి సురేశ్, చండిక ఆనంద్‌కూ తర పథకాన్ని చెప్పాడు. వారికి రూ.25 వేలు ఇచ్చి రాంప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించాలన్నాడు. రెక్కీలో వీరికి సాయిరాం రమేశ్, షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటూ, పత్తిపాటి నరేశ్ తోడయ్యారు. రాంప్రసాద్ ప్రతి శనివారం పంజాగుట్ట దుర్గానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తున్నందున అదే హత్యకు అనువైన ప్రదేశంగా గుర్తించారు.
ఘటనాస్థలిలోనే శ్యామ్.. కొద్దిదూరంలో సత్యం
గత నెల 28న శ్యామ్, బాలనాగాంజనేయ ప్రసాద్ ఆబిడ్స్‌లోని లాడ్జిలో దిగారు. ఈనెల 5న మాదాపూర్ కావూరి హిల్స్‌లోని ఫ్లాట్‌లో బస చేసిన సత్యం.. ఎప్పటికప్పుడు శ్యామ్, సురేశ్, ఆనంద్‌లకు సూచనలివ్వసాగాడు. అదేరోజు ఉదయం సురేశ్ విజయవాడ నుంచి బొలేరోలో కత్తులను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. శ్యామ్, బాలనాగాంజనేయ ప్రసాద్, సురేశ్, ఆనంద్‌లతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద సత్యం భేటీ అయి చర్చించాడు. అనంతరం ప్రసాద్, రాము, ప్రీతమ్ అలియాస్ బాజీ వెంకటేశ్వర ఆలయ సమీపంలోని పార్కులో కూర్చున్నారు. రాత్రి ఏడు గంటల తర్వాత రాంప్రసాద్ నడుచుకుంటూ ఆలయానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఆనంద్ సమాచారాన్ని అందించడంతో బాలనాగాంజనేయ ప్రసాద్, ప్రీతమ్, రాము అప్రమత్తమయ్యారు. రాంప్రసాద్ ఆలయం బయటికి రాగానే ముగ్గురూ తమవద్ద ఉంచుకున్న కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. సమీపంలో యశోద ఆసుపత్రి వద్ద ఉన్న సత్యం.. రాంప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయాడు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- విచారణ ‘దిశ’గా...
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత