గొప్ప ఎడమ చేతివాటం క్రికెటర్లు ఎవరంటే?
close

తాజా వార్తలు

Published : 13/08/2020 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొప్ప ఎడమ చేతివాటం క్రికెటర్లు ఎవరంటే?

యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయమిదీ!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఎడమచేతి వాటం అంటేనే ఏదో ప్రత్యేకత. ఇతరులతో పోలిస్తే వారు భిన్నంగా, తెలివిగా ఉంటారని భావిస్తుంటారు. ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమ చేతివాటం వారి దినోత్సవం. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ ‌సింగ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత గొప్ప ఎడమచేతి వాటం ఆటగాళ్లెవరో చెప్పాడు. నలుగురి చిత్రాలను పోస్ట్‌ చేశాడు. ఇంకా ఎవరినైనా మర్చిపోతే గుర్తు చేయాలని అభిమానులకు సూచించాడు.

యువీ ట్వీట్‌ చేసిన వారిలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్లు మాథ్యూ హెడెన్‌‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఉన్నారు. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాకు చోటిచ్చాడు. తననెంతో ప్రోత్సహించిన టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని ప్రత్యేకంగా గౌరవించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లోని అత్యంత గొప్ప ఎడమ చేతివాటం ఆటగాళ్లకు నివాళి. ఈ జాబితాను మరింత పెంచండి. మీకు ఇష్టమైన ఎడమ చేతివాటం క్రికెటర్‌ ఎవరో చెప్పండి’ అని అతడు వ్యాఖ్య పెట్టాడు.

అభిమానుల నుంచి దీనికి విశేష స్పందన లభించింది. ‘పాజీ ఇందులో మీరు యువరాజ్‌సింగ్‌ పేరు రాయలేదు. భారత్‌లో అతిగొప్ప ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ అతడే’ అని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కామెంట్‌ చేశాడు. మరికొందరు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో అదరగొట్టిన గౌతమ్‌ గంభీర్‌ను మర్చిపోయావని గుర్తు చేశారు. ఇంకొందరు కుమార సంగక్కర, అలిస్టర్‌ కుక్‌, సర్‌ గ్యారీ సోబర్స్‌, క్లైవ్‌ లాయిడ్‌, సనత్‌ జయసూర్య తదితరుల పేర్లు చెప్పారు. యువీ సైతం ఎడమచేతి వాటం ఆటగాడేనన్న సంగతి అందరికీ తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని