అన్నను కడతేర్చిన తమ్ముడు
close

తాజా వార్తలు

Updated : 09/06/2020 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నను కడతేర్చిన తమ్ముడు

ఎదగడం చూడలేక.. తిట్టడం సహించక..

దుండిగల్‌, న్యూస్‌టుడే:  అన్న ఆర్థిక ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయిన తమ్ముడు కడతేర్చి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. దుండిగల్‌ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం మార్కెట్‌లో రోడ్డులో ఉండే షాజదాబేగంకు ఇద్దరు సంతానం. మొదటి భర్త కుమారుడు సాబేర్‌(29), రెండో భర్త కుమారుడు అజం. సాబేర్‌ సొంతంగా ట్యాంకర్‌ కొని వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకొని భార్య, కుమారుడితో వేరుగా ఉంటున్నాడు. మెడికల్‌ షాప్‌లో పనిచేస్తున్న అజం.. ఇది జీర్ణించుకోలేకపోయాడు. భార్య, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లడంతో సాబేర్‌ శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. తమ్ముడికి ఫోన్‌ చేసి రమ్మన్నాడు. అర్ధరాత్రి ఆర్థిక లావాదేవీల విషయంలో వాగ్వాదం జరిగింది. బెడ్‌షీట్‌తో అన్న మెడకు ఉరి బిగించి హత్యచేసి వెళ్లిపోయాడు. ఏమీ జరగనట్లు వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చాడు. అతిగా మద్యం తాగడం వల్లనో.. లేదా గుండెపోటుతోనో మృతిచెంది ఉంటాడని నమ్మబలికాడు. పోలీసులు అజంను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూదమాడుతూ పట్టుబడిన బడాబాబులు
దుండిగల్‌: బౌరంపేటలో 16 మంది పేకాట రాయుళ్లను సోమవారం బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.15.50 లక్షలు, 15 చరవాణులు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్‌ పోలీసులకు అప్పగించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని