close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విశాఖకు అమ్మోనియం నైట్రేట్‌ ముప్పు లేదు’

వెల్లడించిన అధికారుల బృందం

అమరావతి: అమ్మోనియం నైట్రేట్‌ వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందం ఒకటి విశాఖపట్నంలో ఆ పదార్థం నిల్వలను పరిశీలించింది. కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ ఆదేశాల మేరకు మిందిలోని శ్రావణ్‌ షిప్పింగ్‌ సంస్థ గిడ్డంగిని అధికారులు, ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలించింది. ఆర్‌డీవో కిశోర్‌, పీసీబీ ఈఈ సుభాన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శంకర్‌రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. 

పరిశీలన అనంతరం మీడియాతో అధికారులు మాట్లాడుతూ.. విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఉందని వెల్లడించారు. దిగుమతి అయ్యాక ఈ గిడ్డంగి నుంచి ఆయా ఏజెన్సీలకు సరఫరా అవుతున్నాయన్నారు. అలాంటి ఏజెన్సీలు మన రాష్ట్రంలో లేవని చెప్పారు. 270 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దాటాకే ఈ లవణం మండుతుందన్నారు. విశాఖకు అమ్మోనియం నైట్రేట్‌ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా మరింత లోతుగా పరిశీలించాలని అగ్నిమాపక సిబ్బందికి సూచినట్లు చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.