close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/03/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పాగల్‌’తో ‘ఉప్పెన’ కథానాయిక?

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంలో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌ సేన్‌. ఇటీవల ‘హిట్‌’తో ప్రేక్షకులను అలరించారు. ఆయన కథానాయకుడుగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 
కృతి ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వస్తోన్న ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమానే ఆమెకు తొలి చిత్రం. మరోవైపు నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘18 పేజెస్‌’ చిత్రంలోనూ నాయికగా ఎంపికైనట్లు సమాచారం. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.