
తాజా వార్తలు
ఎన్నికలపై ఎస్ఈసీకి నమ్మకం లేదు: వెంకట్రామిరెడ్డి
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేదే ఎస్ఈసీ ఉద్దేశమని ఆరోపించారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి కూడా నమ్మకం లేదన్నారు. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డం పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగులపై ఎదురుదాడి చేయడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే తాను చెప్పానని, ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘ నాపై నిఘా పెట్టాలని డీజీపీకి ఎస్ఈసీ లేఖ రాయడం సరికాదు. నా ప్రాణాలకు రక్షణ కావాలని డీజీపీని కోరతా. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు జరపాలి’’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
కొవిడ్ టీకా వేయించుకున్న ఆశా వర్కర్ మృతి