close

తాజా వార్తలు

Published : 31/07/2020 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుచానూరులో వైభవంగా వరలక్ష్మీవ్రతం

తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం పూజలు వేడుకగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా అమ్మవారికి పూజలు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం అయిదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్య అర్చన పూజలు చేశారు. అనంతరం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అలంకార శోభితురాలైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శాస్రోక్తంగా వరలక్ష్మీ పూజలు చేశారు. 
ఆన్‌లైన్‌ ద్వారా వ్రతం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పోస్టల్‌ ద్వారా వారి చిరునామాకు పంపనున్నారు. అమ్మవారి ఆలయ చరిత్రలో భక్తులు ఎవరూ లేకుండా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఇదే తొలిసారి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.