close

తాజా వార్తలు

Updated : 28/02/2021 18:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస పతనం మొదలైంది: ఉత్తమ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని భాజపా నీటి బుడగలాంటిదని.. మరోవైపు తెరాస పతనం మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడుతున్నారని.. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఏడేళ్ల పాలనలో దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదని మండిపడ్డారు. భాజపా వల్ల తెలంగాణకు ప్రయోజనం లేకపోగా.. తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. దీని వల్ల లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్‌ విమర్శించారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని