
తాజా వార్తలు
చర్చల వేళ అహం అడ్డు రానివ్వొద్దు
భోపాల్: నూతన సాగు చట్టాలపై కేంద్రం, రైతులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా తొలగించుకోవాలని భాజపా నేత ఉమాభారతి సూచించారు. చర్చల వేళ అహం, మొండితనం అడ్డురాకుండా చూసుకోవాలని ఉభయులను కోరారు. ఈ కొత్త చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ శివార్లలో సుమారు రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వర్గాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ క్రమంలో ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతులు, ప్రభుత్వానికి ఇది ఒక అవకాశం. ప్రతిష్టంభనను తొలిగించుకునేందుకు అహం, మొండితనాన్ని అడ్డు రానివ్వకండి’’ అని అన్నారు.
ఇవీ చదవండి..
జూన్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు!
Tags :