close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/03/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌లో లోయలో పడ్డ బస్సు.. 20మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఘాట్‌లో వెళుతున్న బస్సు లోయలో పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రావల్పిండి నుంచి స్కర్దుకు ఓ బస్సు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ బస్సు పర్వత ప్రాంతం నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాల్ని బయటకు తీసినట్లు తెలిపారు. సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.