
తాజా వార్తలు
చేసింది చెప్పాను.. నిర్ణయం మీదే: అర్వింద్
నిజామాబాద్: ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని.. పసుపు పంటకు రూ.15వేలు మద్దతు ధర ఇప్పిస్తామని ఎక్కడా చెప్పలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు బోర్డు తెస్తానని మాత్రమే బాండ్లో రాశానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో పసుపు రైతులతో ఎంపీ అర్వింద్ సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు మద్దతు ధరపై రైతులతో చర్చించారు. బోర్డు ఏర్పాటుపై కేంద్రం నుంచి వచ్చిన అధికారులు తన అభిప్రాయం తీసుకున్నారని.. పసుపు రైతుల సమస్యలపై సమగ్ర వివరాలు తీసుకున్నారని ఎంపీ రైతులకు వివరించారు. ఆ తర్వాతే స్పైస్ బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం నిజామాబాద్‌లో ఏర్పాటైందన్నారు. ఇదంతా తాను ఎంపీ అయిన 9నెలల కాలంలోనే జరిగిందని తెలిపారు. ఈ విధంగా పసుపు మద్దతు ధర కోసం చేసిన ప్రయత్నాలను ఎంపీ వివరించారు.
మరోవైపు ఎంపీ ప్రసంగిస్తున్న సమయంలో మద్దతు ధర విషయంలో సమావేశంలో పాల్గొన్న కొంతమంది రైతులు ఎంపీ అర్వింద్‌పై నిరసన వ్యక్తం చేయగా, ‘చేసిన పనులు చెప్పాను.. నిర్ణయం మీదే’ అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల