ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు తెరాస కైవసం
close

తాజా వార్తలు

Published : 04/05/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు తెరాస కైవసం

హైదరాబాద్‌‌: ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. వరంగల్‌లో 48 డివిజన్లను తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 48 స్థానాల్లో తెరాస గెలుపొందింది. 10 డివిజన్లలో భాజపా కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 4, ఇతరులు 4 డివిజన్లలో విజయం సాధించారు. 
ఖమ్మం కార్పొరేషన్‌ పీఠాన్ని అధికార పార్టీ తెరాస చేజిక్కించుకుంది. 46 డివిజన్లలో తెరాస-సీపీఐ కూటమి విజయం సాధించింది. తెరాస అభ్యర్థులు 43, సీపీఐ అభ్యర్థులు 3 డివిజన్లలో గెలుపొందారు. 11 స్థానాల్లో కాంగ్రెస్‌ - సీపీఎం కూటమి సాధించింది. కాంగ్రెస్‌ 9 స్థానాలు, సీపీఎం 2 స్థానాలు, భాజపా 1, స్వతంత్రులు 2 డివిజన్లలో విజయం సాధించారు. మినీ పురపోరులో తెరాస తన సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 5 మున్సిపాలిటీలు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని