మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నికకు తెరాస పరిశీలకులు వీళ్లే
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నికకు తెరాస పరిశీలకులు వీళ్లే

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన రెండు కార్పొరేషన్లకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియకు పార్టీ పరిశీలకులను తెరాస నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల పరిశీలకుల పేర్లను ప్రకటించారు. 

వరంగల్‌ కార్పొరేషన్‌కు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌.. ఖమ్మంకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌ రెడ్డిలను నియమించారు.  కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకుడిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నకిరేకల్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేటకు కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అచ్చంపేటకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జడ్చర్లకు పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలను నియమించారు. పరిశీలకులు గురువారం సాయంత్రానికి ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం అందజేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లను, మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని