close

తాజా వార్తలు

ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ఇద్దరి మృతి

శేరిలింగంపల్లి(హైదరాబాద్‌): చందానగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద  రైలు పట్టాలు దాటుతూ ఇద్దరు మృతి చెందారు. రైల్వేపోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..చందానగర్‌ నుంచి పాపిరెడ్డి కాలనీవైపు సూర్యకళ ఆమె కుమారుడు మనోహర్‌(24) మేనకోడలు సోని(17)తో కలిసి ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతున్నారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ రైలు వారిని ఢీకొట్టింది. మనోహర్‌, సోని అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యకళ స్వల్పగాయాలతో బయటపడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.