close

తాజా వార్తలు

Published : 01/03/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ట్రాఫిక్‌జామ్‌

సూర్యాపేట (నేర విభాగం): సూర్యాపేట జిల్లాలో గొల్లగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. సూర్యాపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లగట్టు జాతర ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతోందని వాహనచోదకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వైపునకు వెళ్లే భారీ వాహనాలను నార్కెట్‌పల్లి వద్ద దారి మళ్లిస్తున్నప్పటికీ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల తాకిడి అధికంగా ఉంది. దీంతో పెద్దగట్టు నుంచి సువేన్‌ ఫ్యాక్టరీ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. నేటి నుంచి ప్రారంభమైన గొల్లగట్టు జాతర నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని