
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. గుజరాత్ మున్సి‘పోల్స్’: భాజపా క్లీన్‌స్వీప్!
గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్ చేసింది. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకు గాను భాజపా 466 చోట్ల విజయం సాధించి సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమైపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్ బోణీ కొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఒకే అడ్రస్‌పై 37 పాస్‌పోర్టులు: సజ్జనార్
బోధన్ పాస్‌పోర్టు కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్ కూడా ఉన్నట్లు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కరోనా విజృంభణపై మోదీ సమీక్ష
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వైరస్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. దేశంలో వైరస్ తాజా పరిస్థితి, కొత్త రకం కరోనా వ్యాప్తి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రపంచ ప్రఖ్యాత నవల మూన్‌స్టోన్ విశేషాలు..
పసుపు పచ్చ రంగులో కాంతులు విరజిమ్మే చంద్రకాంతమణి (మూన్‌స్టోన్) ధర ఇరవైవేల బ్రిటిష్ పౌండ్లు ఉంటుందని అంచనా వేశారు వ్యాపారులు. ఒకప్పుడిది ఇండియాలోని సోమనాథ్ దేవాలయంలో చంద్రుడిని అలంకరించింది. ఇప్పుడు ఒక ఇంగ్లిష్ యువతికి పద్దెనిమిదో పుట్టినరోజు కానుకగా మారింది. ఆమె పేరు మిస్ రాచెల్ వెరిందర్. అయితే తనమీది ప్రేమతో కాకుండా, కేవలం ప్రతీకారం తీర్చుకోవటానికే దీన్నిచ్చారని ఆమెకు తెలీదు. చిల్లర తిరుగుళ్లు తిరిగి, పలు నేరాలు చేసిన ఆమె అంకుల్ జాన్హెర్న్ హత్యలు, దొంగతనం చేసి ఈ మూన్‌స్టోన్‌ను సంపాదించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. టీజర్‌తోనే అదరగొట్టిన ‘టక్ జగదీష్’
నేచురల్ స్టార్ నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భారత్‌లో 75% యాక్టివ్ కేసులు అక్కడే..
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 75శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై వైద్య శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం 1గంట వరకు దేశ వ్యాప్తంగా 1,17,54,788 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్లేటు బిర్యానీ.. రూ.20 వేలు.. ఎందుకంటే?
బిర్యానీ అంటే లొట్టలేయనిది ఎవరు చెప్పండి.. మన దగ్గరే కాదు.. చాలా దేశాల్లో ఇది పాపులర్ ఫుడ్. సాధారణంగా ప్లేట్ బిర్యానీ ధర రూ. 100 నుంచి రూ. 1000 దాకా ఉంటుంది. అందులో ఉపయోగించే మాంస పదార్థాలను బట్టి ఈ ధర కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ దుబాయిలో దొరికే ఓ బిర్యానీ ధర దాదాపు రూ. 20వేలు. వామ్మో.. అని నోరెళ్లబెడుతున్నారా..! అవును మరి.. ఎందుకంటే అది ‘గోల్డ్’ బిర్యానీ. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్!
వాహన రంగంలో బీఎండబ్ల్యూకు ఉన్న క్రేజే వేరు. కారైనా.. బైకైనా.. తనదైన ప్రత్యేకతతో వినియోగదారుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సంస్థ ద్విచక్రవాహన విభాగమైన బీఎండబ్ల్యూ మోటోరాడ్ భారత విపణిలోకి మరో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ ఆర్18 క్లాసిక్ పేరిట వచ్చిన ఈ కొత్త బైక్.. క్రూయిజర్ సెగ్మెంట్లో సంస్థ తీసుకొచ్చిన రెండో బైక్. ఇక దీని ధరను రూ.24 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. గతంలో తీసుకొచ్చిన ఆర్ 18కు మరిన్ని అధునాత ఫీచర్లు అద్ది దీన్ని అందుబాటులోకి తెచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు?
భారత్ నిర్వహించ తలపెట్టిన బ్రిక్స్-2021 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్ తర్వాత జరిగే ఈ సమావేశానికి సభ్య దేశాల అధినేతలు నేరుగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే, జిన్‌పింగ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నప్పటికీ ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. ఇరుదేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడు పర్యటిస్తారన్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* చైనా టీకాలకు.. శ్రీలంక రాం రాం!
10. రికార్డుల మోతకు మొతెరా సిద్ధం!
మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్షా పది వేల మందికి సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఇరు జట్లు భీకర పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఆ ఘనతలను మొతెరా వేదికగా నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇంతకీ ఆ రికార్డులేంటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ధోనీ రికార్డులా..మేం అసలు పట్టించుకోం: కోహ్లీ