close

తాజా వార్తలు

Published : 01/03/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకా

2. ఈ ఏడాది ఒక డిగ్రీ ఎక్కువే

అప్పుడే రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రం వేడెక్కుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో విద్యుత్తు వినియోగం పెరగడంతో డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరింది. అధిక వేడి ప్రభావం పంటల దిగుబడిపైనా ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘డ్రాగన్‌’ కుతంత్రాలకు చెక్‌

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల నుంచి భారత్‌, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ జోరందుకుంది. ఆసియా దిగ్గజాలైన ఇరుదేశాలు పలు దఫాలుగా జరిపిన చర్చల ద్వారా ఇప్పటికైతే తమ దళాలను వెనక్కి తీసుకున్నా, అంతర్గతంగా విభిన్న ప్రణాళికలతో ఉన్నాయి. సీనియర్‌ సైనిక కమాండర్ల మధ్య పది విడతలుగా చర్చలు జరిగాయి. కఠినతర పరిస్థితులు ఉండే శీతకాలం కూడా ముగిసింది. దీంతో తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత, చైనా దళాలు వెనక్కి మరలడం మొదలుపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నగదు బదిలీ రూ.నాలుగే

వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో.. ఒక్కో సిలిండర్‌పై రూ.170 నుంచి రూ.500 వరకు రాయితీ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమయ్యేది. రాయితీ పోను సగటున రూ.500 వరకు వినియోగదారుడు భరించేవారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర విజయవాడలో రూ.816కు చేరగా.. రాయితీ మాత్రం 16కి పడిపోయింది. అదే విశాఖపట్నంలో అయితే సిలిండర్‌ ధర రూ. 800 కాగా సబ్సిడీ రూ.4 చొప్పునే పడుతోంది. ఒక్కో ఊళ్లో ఒక్కోలా రాయితీ వస్తున్నా... ఎక్కడా 50 రూపాయలకు మించి లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బీమాతోనే మాకు ధీమా

5. వివాదాల కొండ

విత్ర కృష్ణాతీరాన వెలిసిన ఇంద్రకీలాద్రి విశిష్టమైనది.. శక్తి మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఈ కొండమీద కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి స్వయంగా అవతరించారని స్థలపురాణం చెబుతోంది. అంతటి ప్రాశస్త్యంతో పాటు, రాష్ట్రంలోనే రెండో పెద్దదైన ఈ దేవస్థానంలో అడుగడుగునా అక్రమాలు.. అవినీతి.. ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. ఆలయంలో ఎక్కడా ఒక వ్యవస్థ అంటూ కనిపిస్తున్న దాఖలాల్లేవు. కోట్లు వెచ్చించి పనులు చేశామంటారే గానీ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది. కొత్త సౌకర్యం ఒక్కటీ కానరాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే

దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాల వాహనాన్ని ఉంచడం తమ పనేనని ‘జైష్‌-ఉల్‌-హింద్‌’ అనే సంస్థ ప్రకటించుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈమేరకు టెలిగ్రామ్‌ యాప్‌లో ఆ సంస్థ ఒక మెసేజి పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయి.. ముంబయి పోలీసుల దృష్టికి వచ్చింది. ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!

పులి, చిరుత.. అని చెవినపడితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఓ చిరుత ఎదురుపడితే ప్రాణాలు గాల్లో కలిసినంత పనవుతుంది. అలాంటిది పిడుగులా మీదపడ్డ చిరుతతో భీకరంగా పోరాడి పైచేయి సాధించాడు కర్ణాటకకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి  రాజగోపాల్‌ నాయక్‌. భార్యాబిడ్డలను కాపాడుకునేందుకు గత సోమవారం కర్ణాటకలోని హాసన జిల్లా బైరగొండనహళ్లిలో ఆయన చూపిన తెగువ యావత్‌ దేశ ప్రజల ప్రశంసలు అందుకుంది. ఆ నాటి ఘటనతో తీవ్రంగా గాయపడి, కోలుకుంటున్న 38 ఏళ్ల రాజగోపాల్‌ ‘ఈనాడు డిజిటల్‌’ ప్రతినిధితో తన అనుభవం పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

8. రాయితీలకు సున్నం

సామాన్యుల నుంచి సంపన్నులవరకూ అందరికీ ప్రయాణ వనరుగా రైల్వేకు పేరుంది. ఆ గుర్తింపునకు తగ్గట్టే వివిధ వర్గాలను గౌరవించడంలో కూడా ముందుండేది. కరోనా ఆ పేరును తుడిచేసింది. రైలునంబరుకు ముందు ‘సున్నా’ జోడించి  ప్రత్యేక రైళ్లపేరుతో 51 రాయితీలకు తిలొదకాలిచ్చింది. ఏడాది కావొస్తున్నా.. నిత్యం నడిచే రైళ్ల సంఖ్య పెరుగుతున్నా.. రాయితీల పునరుద్ధరణను గాలికొదిలేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వ్యవధి తక్కువే.. శ్రద్ధతో సాధ్యమే!

అరకొరగా విన్న ఆన్‌లైన్‌ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్‌ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో! తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు (ఐపీఈ) మే లోనూ, ఎంసెట్‌ జులైలోనూ నిర్వహించనున్నారు. ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే రెండు రకాల పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించవచ్చు. ఎంసెట్‌ 160 ప్రశ్నలకు ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అలా చేశాక జుట్టు ఊడుతుంది?

10. మైదానంలో మాణిక్యాలు

లక్ష్యం కోసం పోరాడే పట్టుదల.. అడ్డంకులను అధిగమించే ఆత్మవిశ్వాసం.. సరైన మార్గనిర్దేశనం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ఈ అమ్మాయిలు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వాళ్ల గ్రామాలున్నాయి.. అయితేనేం తమ ప్రతిభతో వెలుగులోకి వస్తున్నారు. వాళ్లవి పేద కుటుంబాలే.. అయితేనేం ప్రతిభ, నైపుణ్యాలనే ఆస్తి వాళ్ల సొంతం. ఈ నెల 11 నుంచి ఆరంభం కానున్న బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే ట్రోఫీ కోసం ఇటీవల ప్రకటించిన హైదరాబాద్‌ అమ్మాయిల జట్టులో తొలిసారి చోటు దక్కించుకుని సత్తాచాటారు. వాళ్లే.. అంజలి, నిఖిత, అనిత, పార్వతి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని