close

తాజా వార్తలు

Published : 24/01/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కుర్రకారు.. ఆరంకెల హుషారు

అయిదు అంకెల జీతం.. ఒకప్పుడు ఉద్యోగుల గురించి గొప్పగా చెప్పుకునే మాట. ఇప్పుడు పట్టుమని 22 సంవత్సరాలు కూడా లేని కొందరు బీటెక్‌ విద్యార్థులు ప్రారంభంలోనే ఆరు అంకెల వేతనాన్ని అందుకుంటున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఘనమైన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు.  ప్రముఖ ఐఐటీల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న పదుల సంఖ్యలోని విద్యార్థులు ఏకంగా రూ. 20 లక్షల నుంచి రూ. 33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ బడుల్లో చదివిన వారే. ఈ విజయం ఎలా సాధ్యమైంది? తదితర వివరాలతో ప్రత్యేక కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌లో డ్యామ్‌లకు కాలం చెల్లుతోంది

భారత్‌లో అనేక భారీ డ్యామ్‌లకు కాలం చెల్లుతోందని ఐరాస నివేదిక హెచ్చరించింది. 2025 నాటికి దేశంలో వెయ్యికిపైగా డ్యామ్‌లు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి పాత జలాశయాల వల్ల పెను ముప్పు పొంచి ఉందని స్పష్టంచేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో అధికశాతం.. 20వ శతాబ్దంలో నిర్మించిన డ్యామ్‌లకు దిగువన ఉంటారని తెలిపింది. ‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: యాన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌’ పేరుతో ఈ నివేదికను ఐరాస విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కెనడాలో ఉన్న ‘జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ’ తయారుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూడో ధ్రువమూ ఉంది!

త్తర, దక్షిణ ధ్రువాలు రెండే అని మనకు తెలుసు. కానీ థర్డ్‌ పోల్‌ అని ఒక ప్రాంతాన్ని అంటారు. అది మన దేశ సరిహద్దులోనే ఉంది. హిమాలయ- హిందుకుష్‌ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూడోధ్రువమని అంటారు. ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఉండనంత ఎక్కువ మంచు ఇక్కడ నిల్వ ఉంటుంది. చుట్టూ ఉన్న పర్వతాల మీది నుంచి ఆ మంచు కరిగి తయారైన స్వచ్ఛమైన నీరు అక్కడి నుంచి కిందికి ప్రవహిస్తుంటుంది. ధ్రువ ప్రాంతాల తర్వాత ఎలాంటి కాలుష్యాలూ లేని శుభ్రమైన నీరున్న ప్రాంతం ఇదొక్కటే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నకిలీ బాబాల నయవంచన

మొక్కుకోవడానికి ముక్కోటి దేవతలున్నా భారతీయుల ఆర్తి తీరనిది. ‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది... డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది’ అని గజ్జెల మల్లన్న కవి దశాబ్దాల క్రితమే హెచ్చరించినా- ప్రభుత్వాల బాధ్యత ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. అది చాలు, నకిలీబాబాల లీలావిలాసాలు దేశవ్యాప్తమై గబ్బు లేపడానికి! ఆధ్యాత్మికం ముసుగులో అమాయక జనాల్ని ఆకర్షించి, రాజకీయ నేతల్ని, ఉన్నతాధికార శ్రేణుల్ని అక్కున చేర్చుకొని, భోగలాలసత పెరిగి, నేరాలు మరిగి వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆశ్రమాలతో నకిలీ బాబాలు సాగిస్తున్న అరాచకం అంతాఇంతా కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. ఇంధన దడ

పావలా.. పావలా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు తెలియకుండానే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు ధర రూ.93.. డీజిల్‌ రూ.86 మార్కు దాటేశాయి. సెంచరీ దిశలో పరుగులు తీస్తున్నాయి. వినియోగదారులు లీటరుకు చెల్లించే మొత్తంలో రెండొంతుల సొమ్ము (సుమారు రూ.60పైగా) పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకే జమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు ఎక్సైజ్‌, ఇతర పన్నులు పెంచడం.. ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించకపోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

*​​​​​​​ హిందీ, ఇంగ్లీషు కలిపి మాట్లాడినా స్పందిస్తుంది

6. ఇప్పుడే ఇలా..మున్ముందు ఎలా?

కొవిడ్‌ టీకాల పంపిణీలో కొవిన్‌ యాప్‌ సాంకేతికంగా ఉపయుక్తంగా మారుతుందని వైద్యశాఖ భావించగా.. అందులోనూ ఇబ్బందులు తప్పడంలేదు. సాంకేతిక సమస్యల కారణంగా నిర్దేశించిన లబ్ధిదారులలో సగం మంది వివరాలే యాప్‌లో పొందుపరచగలుగుతున్నారు. మిగిలిన వారి సమాచారాన్ని పుస్తకాల్లో రాస్తున్నారు. తిరిగి యాప్‌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడే అందులో చేరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గంటల తరబడి వరుసలో నిలబడలేక వైద్యనిపుణులు టీకాలు పొందకుండానే వెనుదిరుగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. కాలేజీకి వెళ్లాల.. ఖర్చులెలా!?

రాష్ట్రంలో వివిధ కోర్సులు చదువుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన రుసుంల మంజూరులో జాప్యం జరుగుతోంది. గత విద్యా సంవత్సరానికి (2019-20) సంక్షేమ శాఖలు దరఖాస్తులు పరిశీలించి, నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీచేసినా ఖజానా ఆంక్షలతో ఆమోదం లభించడం లేదు. దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు నేటికీ నిధులు విడుదల కాలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక అభివృద్ధి నిధుల కారణంగా చెల్లింపులు కొంత ఫర్వాలేకున్నా, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు భారీగా పెండింగ్‌ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. పస్తులుండి పాటలు రాశాను!

కిట్టూ విస్సాప్రగడ... నేటి కుర్రకారు మెచ్చిన గీతరచయిత. ‘ఉండిపోరాదే’(హుషారు), అరెరే మనసా(ఫలక్‌నుమా దాస్‌), తరగతిగది దాటి(కలర్‌ఫొటో)... ఈ పాటలన్నీ తనవే. సినిమాలపైన ఆసక్తి ఉన్నా అందరిలాగే ఇంజినీరింగ్‌ చదవడం, ఆ రంగం నచ్చక వెండితెరవైపు రావడం, చావోరేవో అన్నట్టు పోరాడటం... కొత్తతరం కళాకారుల ప్రయాణం ఇంచుమించు ఇలాగే ఉంటోంది. కాకపోతే, ఆ క్రమంలో ఎదుర్కొన్న కష్టాల తీవ్రతే వాళ్ల విజయాల విలువని పెంచుతోంది! అలా చూస్తే కిట్టూ విజయాలు అమూల్యమైనవి. ఎందుకో చూడండి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. బంగారం దొంగలు చిక్కారు

తమిళనాడులోని హోసూరు ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో 25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని మహారాష్ట్రకు పారిపోతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అధికారులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్‌ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్‌ సమీపంలో లారీ కంటైనర్‌లో తీసుకెళ్తున్న రూ.12.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.93 వేల నగదు, తుపాకులు, పిస్తోళ్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే...

తనని గుండెలపైన ఆడించిన నాన్న... తన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న... ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్‌ అలా చేయలేదు.. గుండెని రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న సమయంలో తల్లి షబానాబేగం చెప్పిన ఓ మాట అతనిపై మంత్రంలా పనిచేసింది.  అతన్ని ఆపింది. ఆమాటలే అతని విజయానికి బాటలు పరిచాయి.. తండ్రి కలని నిజం చేశాయి... ఇంతకీ ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

గాయాల గోల.. ఎందుకిలా?Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని