close

తాజా వార్తలు

Published : 01/03/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారు: వర్ల రామయ్య

ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత వర్లరామయ్య మండిపడ్డారు. సోమవారం రాజకీయ నేతలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెదేపా తరఫున వర్లరామయ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేటీఆర్‌ ఎక్కడా..? ఎన్డీఏ అంటే ఇదే!

ఉద్యోగాల కల్పనపై అధికార తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే మీడియా ముందు వాదనలు వినిపిస్తున్న నేతలు సామాజిక మాధ్యమాల్లోనూ దీటుగా బదులిచ్చుకుంటున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. హైదరాబాద్‌ పట్టభద్రుల భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు మధ్య ఇవాళ  ట్విటర్‌లో సంవాదం జరిగింది. ఉద్యోగాలపై చర్చకు రావాలని కేటీఆర్‌కు రాంచందర్‌రావు సవాలు విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎదురు చూస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. న్యాయవాదుల హత్యపై హైకోర్టు ప్రశ్నలు

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పోలీసులను పలు ప్రశ్నలు వేసింది. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లు స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించింది. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బస్సులోని ప్రయాణికులందరినీ గుర్తించారా? అని అడిగింది. వీటికి సమాధానమిచ్చిన అడ్వొకేట్‌ జనరల్ ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా మరణాల్లేని 20 రాష్ట్రాలివే..!

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్న ఈ జిత్తులమారి వైరస్‌ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ వైరస్‌ ప్రభావం అంతగా కనబడనప్పటికీ కేవలం ఐదారు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగానే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు నమోదుకాకపోవడం విశేషం. నిన్న 106 కొవిడ్‌ మరణాలు నమోదైనప్పటికీ వీటిలో 87% మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడులలోనే రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కొవిడ్‌ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి

5. స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా లాభాల్లోనే

గతవారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకర సంకేతాలతో పాటు దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం, కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుండడం వంటి వార్తలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. ఉదయం 49,747 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 50,058 వద్ద గరిష్ఠాన్ని.. 49,440 వద్ద కనిష్ఠాన్ని తాకింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* స్వల్పంగా నెమ్మదించిన ‘తయారీ’

* గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

6. గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌

గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ కేసులో బిహార్‌, ఝార్ఖండ్‌కు చెందిన ఐదుగురితో పాటు మంచిర్యాలకు చెందిన మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 900 స్క్రాచ్‌ కార్డులు, 28 డెబిట్‌ కార్డులు, 10 ఆధార్‌కార్డులు, రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బెంగాల్‌లో 8 విడతలపై సుప్రీంకు..  

పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడతల్లో శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 24 నియమాలను ఉల్లంఘిస్తోందని, దీనిపై వెంటనే స్టే విధించాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ రైతుల భాగస్వామ్యం లేనిదే వృద్ధి లేదు - మోదీ

చిన్న, సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే భారత్‌ వృద్ధి సాధించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో రైతులు ఆందోళన చేస్తోన్న వేళ, బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులను ఆయన సమర్థించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కేటాయింపులు, ఆ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ ‘పవర్’‌పై డ్రాగన్‌ గురి!

సరిహద్దు విషయంలో భారత్‌తో యుద్ధానికి కాలుదువ్విన చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలతో గతేడాది రెండు దేశాల మధ్య నెలలపాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో డ్రాగన్‌.. మన దేశ విద్యుత్తు‌ రంగంపై గురిపెట్టినట్లు తాజాగా తెలిసింది. భారత ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, లోడ్‌ డిస్పాచ్‌‌ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ తమ అధ్యయనంలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పుడు కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడు 

తాను మానసిక సమస్యలతో సతమతమైనప్పుడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడని, తన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడని ప్రముఖ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో తాను ఎలా ఉండదల్చుకున్నాడో మాక్సీ ఈ సందర్భంగా వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని