close

తాజా వార్తలు

Published : 24/01/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్‌ మారింది. తొలుత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటిషన్‌ ఉండగా.. తాజాగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ బెంచ్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉద్యోగ సంఘాలు సైతం వేరే పిటిషన్‌ దాఖలు చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: యనమల

* సుప్రీం తీర్పునకు కట్టుబడి ఉండాలి: రామకృష్ణ

2. దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీకి రైతుల సన్నాహాలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడంతో అన్నదాతలు సన్నాహాలు ముమ్మరం చేశారు. హరియాణా, పంజాబ్‌కు చెందిన కర్షకులు ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. మువ్వన్నెల జెండాలతో ఉన్న ట్రాక్టర్లు హస్తిన వైపు పయనిస్తున్నాయి. దిల్లీ రింగురోడ్డు పరిధిలో 100 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నదాతలు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

* ముంబయికి వేల మంది రైతుల కవాతు

3. 6 రోజుల్లో 10లక్షల మందికి టీకా!

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదట వ్యాక్సినేషన్‌‌ ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో అతి తక్కువ సమయంలోనే పదిలక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది. కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి టీకా అందించామని.. ఆదివారం నాటికి ఈ సంఖ్య 16లక్షలకు చేరుకుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. భారత్‌ కంటే ముందే బ్రిటన్‌, అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేటీఆర్‌ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్‌ చూశారా..?

టాలెంట్‌ ఏ ఒక్కరి సొత్తు కాదు.. మట్టిలో పుట్టిన మాణిక్యం.. 130 కోట్ల మందిలో ఎంత మంది ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌లు పుట్టాలి.. వంటి డైలాగ్‌లు తరచూ వింటుంటాం కదా..! కేటీఆర్‌ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్‌ చూస్తే ఆ మాటలన్నింటికీ సార్థకం చేకూరినట్లే అనిపిస్తుంది. తోటి పిల్లలో సరదాగా ఊరి చివరకు వెళ్లి ఆడుకునే వయసు.. టాలెంట్‌ మాత్రం ఘనం. అలాంటి ఓ పిల్లోడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విశాఖలో పూల సోయగాల కనువిందు

కొవిడ్‌ తర్వాత జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు. విహారయాత్రలకూ వెళ్తున్నారు. వారిని ఆకట్టుకునేలా పర్యాటక ప్రాంతాలు అందంగా ముస్తాబవుతున్నాయి. సందర్శకులకు నచ్చేలా రిసార్టుల నిర్వాహకులు వాటి రూపురేఖలు మార్చుతున్నారు. కనువిందు చేసే పూల సోయగాలతో రిసార్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్‌ సరికొత్త హంగులతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. విశాఖ సమీపంలోని సన్ రే రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పూల సొబగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెట్రోమంటలకు బడ్జెట్‌లో ఉపశమనం..?

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొవిడ్‌ సమయంలో పన్నులు పెంచడంతో ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కాకపోతే.. అప్పట్లో ఆదాయవనరులు లేకపోవడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. దీంతో ఇప్పటికైనా ఇంధనంపై పన్నులను తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.90 మార్కును దాటడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనా దుశ్చర్యలను తిప్పికొట్టడానికి సిద్ధం!

సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తే.. భారత్‌ కూడా అదే రీతిలో స్పందిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా స్పష్టం చేశారు. డ్రాగన్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు భారత సేనలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జోధ్‌పూర్‌లో భారత్‌ వాయుసేన, ఫ్రాన్స్‌ వాయు సేన, అంతరిక్ష దళాలు ‘డెసర్ట్‌ నైట్‌-21’ పేరిట సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌-చైనాలు నేడు 9వ విడత సమావేశం కానున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘GDP’ బ్రహ్మాండం: ప్రభుత్వంపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రం!

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ హయాంలో GDP( గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌) ధరలు బ్రహ్మాండంగా పెరిగాయంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఓవైపు సామాన్య ప్రజలు బాధపడుతుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయి

వచ్చేనెలలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు వాటంతట అవే పడతాయని మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వామ్‌ అన్నాడు. అలాగే ఆ సిరీస్‌లో తమ జట్టు లెగ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ కీలక ఆటగాడిగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు జాక్‌‌ లీచ్‌, డామ్ ‌బెస్‌ చెరో ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. దీంతో వారిద్దరూ భారత్‌లోనూ సత్తా చాటాలని మాజీ స్పిన్నర్‌ ఆకాంక్షిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సంజూని కెప్టెన్‌ కాకుండా వైస్‌కెప్టెన్‌ చేయాల్సింది

10. నటీమణుల కష్టాలను కళ్లారా చూశా: సునీత

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్‌, వివాహానంతర జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* స్టార్‌ హీరో వెడ్డింగ్‌.. ఫొటోలు వైరల్‌Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని