close

తాజా వార్తలు

Published : 01/03/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. మా గొంతు నొక్కలేరు : చంద్రబాబు

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. తమ గొంతు నొక్కలేరని ట్విటర్‌ వేదికగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. భయపెట్టి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు. జగన్‌ ఇంకా రాజకీయ పరిణితి సాధించాలని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రతిపక్ష నేతకి రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా?

2. నర్సుతో ప్రధాని ఏం మాట్లాడారంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు. అర్హులందరూ టీకా తీసుకోవాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తనకు టీకా ఇచ్చిన నర్సుతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడే మరో నర్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ఆయన టీకా ఇవ్వగా..కేరళకు చెందిన నర్సు రోశమ్మ అనిల్ కూడా ఆ సమయంలో పక్కనే ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!

గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పైనా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని సోమవారం వెల్లడించాయి. మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై రూ. 225 పెరగడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా... ఫిబ్రవరి 4న ఇది రూ.719కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీకా తీసుకున్న మంత్రి ఈటల

 తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా టీకా వేయించుకున్నారు. హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆయన టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం నేటి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘కొవిన్‌’.. నమోదు ఇలా

5. నటి హిమజకు పవన్‌ లేఖ

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తోటి కళాకారులను సత్కరించడంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముందుంటారు. తాజాగా ఆయన నటి హిమజకు అభినందనలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించిన హిమజ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ - క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆ సినిమా షూట్‌లో సైతం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దీదీతో ఆర్జేడీ దోస్తీ.! 

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో మరో కూటమి తెరపైకి వస్తోంది. బిహార్ వెలుపల తమ పార్టీని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్‌.. రానున్న ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేడు బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ కానున్నారు. కాళీఘాట్‌లోని దీదీ నివాసంలో జరగబోయే ఈ భేటీలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోల్చితే రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించింది. ఆదివారం 15,510 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలకు పైబడింది. మరణాల సంఖ్య వందకుపైనే కొనసాగుతోంది. తాజాగా 106 మంది వైరస్‌కు బలవ్వగా..ఇప్పటి వరకు 1,57,157 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గురూ.. ఇది ఫేస్‌బుక్‌ ‘టిక్‌టాక్‌’

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ షార్ట్‌ వీడియో ప్రియుల కోసం బార్స్‌ (BARS) పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్ తరహా ఫీచర్స్‌తో కొత్తగా ర్యాప్‌ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్ చేశారు. బార్స్‌లోని ఫీచర్స్‌ సాయంతో యూజర్స్‌ సులభంగా ర్యాప్‌ వీడియోలను రూపొందించి షేర్ చేసుకోవచ్చు. ఇందులోని ప్రీ-రికార్డెడ్‌ ఫీచర్‌తో మన సొంత పదాలకు ప్రొఫెషనల్‌‌ ర్యాప్‌ స్టైల్ వీడియోను రూపొందించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విద్యార్థిని అత్యాచారం డ్రామా!

 హోంవర్క్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక అపహరణ, అత్యాచారం డ్రామాకు తెరతీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వైద్య పరీక్షల అనంతరం బాలిక చెబుతున్నవన్నీ అవాస్తవాలని వెల్లడికావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరకన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి బాలిక గత బుధవారం పాఠశాల నుంచి తిరిగిరాలేదు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..!

టీమ్‌ఇండియాతో తలపడిన మూడో టెస్టులో తమ జట్టు పూర్తిగా విఫలమైందని, కోహ్లీసేన బాగా ఆడిందని ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ఫోక్స్‌ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుకు ముందు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చివరి టెస్టులో తమ జట్టు మరింత బాగా బ్యాటింగ్‌ చేయడానికి సరైన మార్గం కనుగొనాలని తెలిపాడు. గతవారం జరిగిన పింక్‌బాల్‌ టెస్టుపై స్పందించిన ఫోక్స్‌.. అది కఠినమైన పిచ్‌ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని