close

తాజా వార్తలు

Updated : 24/01/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. అట్టుడుకుతున్న రష్యా!

ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ విడుదల కోసం జరుగుతున్న ఆందోళనలతో రష్యాలోని ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘‘ఎన్నికలపై ఎస్‌ఈసీకి నమ్మకం లేదు’’

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేదే ఎస్‌ఈసీ ఉద్దేశమని ఆరోపించారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి కూడా నమ్మకం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌

తన ముద్దుల కుమార్తె నిహారికకు ఘనంగా పెళ్లి చేసిన ఆనందంలో ఉన్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఐదు రోజులపాటు జరిగిన నిహారిక-చైతన్యల పెళ్లి వీడియోలను సైతం నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉంటున్న నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక 

కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్‌ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడంతో వారిని ఆదుకోవడానికి వివిధ చర్యలు చేపడూ ‘అమెరికన్‌ ఆపద రక్షక ప్రణాళిక’ను రూపొందించారు. అందులో భాగంగా..  ప్రతి నిరుద్యోగికి 2,000 డాలర్లు (రూ.1.40 లక్షలు) ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. ఇప్పటికే 600 డాలర్లు ఇవ్వగా, మిగిలిందీ వెంటనే అందివ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: గవర్నర్‌

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనా యాప్‌లపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

టిక్‌టాక్‌ సహా వివిధ చైనా యాప్‌ల వినియోగంపై దేశీయంగా విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు యాప్‌ యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. నిషేధం పొడిగింపుపై స్పందించిన టిక్‌టాక్‌.. భారత చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల గోప్యతే తమ తొలి ప్రాధాన్యమని టిక్‌టాక్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 15,948 రికవరీలు.. 14,849 కేసులు 

భారత్‌లో గత 24 గంటల్లో 7,81,752 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,849 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల సంఖ్య నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య  1,06,54,533కి చేరింది. కొత్తగా 15,948 మంది వైరస్ బారి నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,16,786కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.83 శాతానికి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

కలకాలం తోడుగా ఉంటానని మాటిచ్చిన అతను భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కష్ట, సుఖాల్లో అండగా ఉంటానని ప్రమాణం చేసిన అతను ఆమె వెంటే నడిచాడు. తుదిశ్వాస వరకూ వెన్నంటి ఉంటానని బాస చేసిన ఆ భర్త మరణంలో భార్యకు తోడయ్యాడు. వివరాల్లోకి వెళితే..  విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోని పందిరప్పన్న కూడలిలో మనోహర్‌(56), సూర్య ప్రభావతి(47) దంపతులు నివాసం ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్‌

పాటలు.. ప్రశంసలు.. స్పీచ్‌లతో ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతున్న ఓ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుకోనివిధంగా జరిగిన ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురయ్యేలా చేసింది.  ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’ ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు మున్నా.. స్టేజ్‌పై హీరో వెనుక నిల్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్టేజ్‌పై ఉన్న ప్రదీప్‌, ఇతర చిత్రబృందం ఆయనకు మంచినీళ్లు అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే.. 

ఇటీవల టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘన విజయానికి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ కూడా ఓ కారణమని రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి సెటైర్లు వేశాడు. సిడ్నీ టెస్టులో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ‘గబ్బాకు రా చూసుకుందాం’ అని పైన్‌ అంటే.. ‘నువ్వు ఇండియాకు వస్తే అదే నీ ఆఖరి సిరీస్‌’ అంటూ అశ్విన్‌ సైతం సవాల్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేయాల్సింది కాదన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
జాతీయ- అంతర్జాతీయ
పాలిటిక్స్
సినిమా
క్రీడలు
క్రైమ్