
తాజా వార్తలు
ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేసిన ఏపీ
అమరావతి: ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భవనాలకు ప్రామాణిక నిర్మాణశైలి, ప్రణాళికల కోసం బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల, ఆసుపత్రి, ప్రభుత్వ భవనాలు, క్రీడా ప్రాంగణాలు, సాంస్కృతిక కేంద్రాలు ఇలా ఒకే తరహా నిర్మాణశైలి ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం రాష్ట్ర ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేసింది. గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ప్రామాణిక నిర్మాణశైలికి ప్రభుత్వం కార్యచరణను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నేతృత్వంలో 12 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్కిటెక్చరల్ బోర్డు ఓఎస్డీగా స్టేట్ ఆర్కిటెక్ట్ ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి..
కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ అనుమతి
https://www.eenadu.net/latestnews/kurnool-airport-gets-dgca-approval/0600/121011210
రామ మందిరానికి రఘురామకృష్ణరాజు విరాళం
https://www.eenadu.net/latestnews/raghurama-krishnaraju-donation-to-ram-temple/0500/121011182