close

తాజా వార్తలు

Updated : 01/03/2021 06:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలుడు.. లాక్‌డౌన్‌లో రామాయణం రాసేశాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌లో మీరేం చేశారంటే ఏం చెబుతారు..? ఆ.. ఏముంది ఇంట్లోనే కుటుంబసభ్యులతో సరదాగా సమయం గడిపాం. టీవీ చూస్తూ.. ఆడుకుంటూ.. నచ్చిన వంటకాలు వండుకొని తిన్నాం అంటారా? నిజమే చాలా మంది లాక్‌డౌన్‌ కాలం ఇలాగే గడిచిపోయింది. కానీ, ఒడిశాలో పదేళ్ల బాలుడు లాక్‌డౌన్‌లో రామాయణ ఇతిహాసాన్ని ‘పిలక రామాయణ’ పేరుతో తిరిగి రచించాడు. ఇటీవల ఆ బాలుడు రాసిన పుస్తకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. 

కరోనా నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా మార్చి చివరి వారంలో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేదు. ప్రజలకు వినోదం.. జ్ఞానం పంచాలనే ఉద్దేశంతో గతంలో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్‌ను కేంద్రం డీడీ ఛానెల్‌లో మరోసారి పునఃప్రసారం చేసింది. ఈ క్రమంలో చాలా మంది పెద్దలు తాము వయసులో ఉన్నప్పుడు ప్రసారమైన సీరియల్‌ మళ్లీ వస్తుండటంతో వారి పిల్లలకు.. మనవళ్లకు చూపిస్తూ ఎంతో సంతోషపడ్డారు. ఆ విధంగానే ఒడిశాకు చెందిన పదేళ్ల ఆయుష్‌ కుమార్‌ కుంథియాను కూడా రామాయణం సీరియల్‌ చూడమని అతడి కుటుంబసభ్యులు సూచించారట. అంతేకాదు.. రామాయణం చూశాక దానిపై వ్యాసం రాయమని చెప్పారట. 

అయితే, నాలుగో తరగతి చదువున్న ఆయుష్‌ వ్యాసం కాదు.. ఏకంగా రామాయణాన్నే మళ్లీ రచించాడు. రామాయణం సీరియల్‌ మొత్తం చూశాక.. ఒక్కో ఎపిసోడ్‌ను మాతృభాష ఒడియాలో తన వయసు పిల్లలకు అర్థమయ్యేలా రచించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా రాముడు అరణ్యవాసానికి బయలుదేరడం.. రావణుడు సీతను అపహరించడం.. అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడికి ప్రజలు స్వాగతం పలికే ఘట్టాలను ఆయుష్‌ తనదైన శైలిలో వివరణాత్మకంగా లిఖించాడట. 104 పేజీలున్న ఈ పిలక రామాయణాన్ని పూర్తి చేయడానికి తనకు రెండు నెలలు పట్టిందని ఆయుష్‌ చెప్పుకొచ్చాడు. పిల్లలు హోంవర్క్‌ చేయడమే కష్టంగా భావిస్తున్న ఈ రోజుల్లో పదేళ్ల ఆయుష్‌ రామాయణాన్ని రచించడం అభినందనీయం.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని