
తాజా వార్తలు
మహిళలకు ఆదర్శంగా వి-హబ్: కేటీఆర్
తెలంగాణ, గుజరాత్ మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్: ఆవిష్కరణల రంగంలో మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్‌లకు నూతన ఆవిష్కరణల అంశంలో చేయూతనివ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలోని వి-హబ్, గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్టప్‌లను ఎంపిక చేసి, అన్నిరకాలుగా సాయం అందించాల్సి ఉంటుంది. తద్వారా ఆయా స్టార్టప్‌లు మరింత మూలధనాన్ని అందిపుచ్చుకోవటమే కాకుండా అవసరమమైన మెంటర్షిప్ వీరికి లభించనుంది.
వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆవిష్కరణల రంగంలో దేశంలోని పలు రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఈ రంగంలో, ప్రత్యేకంగా మహిళలకు వి-హబ్ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా భవిష్యత్తులో దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు రాష్ట్రాలకు చెందిన మహిళా స్టార్టప్‌లకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో కేవలం సామర్థ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నొవేషన్ మరింత ముందుకు పోతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
టీకా వేయించుకున్న తొలి పొలిటీషియన్లు వీరే..!