
తాజా వార్తలు
‘వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలి’
ఎస్ఈసీకి వర్ల రామయ్య లేఖ
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శనివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి.. వారు పని చేస్తున్న రెవెన్యూ డివిజన్లలో కాకుండా ఇతర చోట్ల విధులు వేయాలని కోరారు. పంచాయతీ ఎన్నికలను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.
అధికార వైకాపా పార్టీ జెండా రంగుల అంశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేయాలని వర్ల రామయ్య కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రజలను, విధి నిర్వహణలో ఉన్న అధికారులను కరోనా బారి నుంచి కాపాడేందుకు కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
ఆ అధికారుల్ని తప్పించలేం
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆలయాలపై దాడులు