కరోనా ‘సందేశ్‌’తో సందేశం
close

తాజా వార్తలు

Published : 07/04/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘సందేశ్‌’తో సందేశం

 

కోల్‌కతా: ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో కూడా కొందరి మెదడు యమ చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అందరు కరోనా ఉద్ధృతిలో కొట్టుకుపోతుంటే కోల్‌కతాలోని ఓ స్వీట్ షాపు మాత్రం ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కరోనా వైరస్‌ ఆకారంలో స్వీట్లను తయారు చేసి ఉచితంగా అందజేస్తూ కరోనా నివారణపై ప్రచారం చేస్తూ తమ సామాజిక స్పృహను చాటుకుంది. 
పశ్చిమ బెంగాల్ సందేశ్ స్వీట్లకు పెట్టింది పేరు. అయితే అక్కడి ప్రముఖ స్వీట్‌ షాపు మాత్రం కరోనా వైరస్‌ ఆకృతిలో సందేశ్‌ స్వీట్లను తయారు చేసి షాపుకు వచ్చిన ప్రతి కస్టమర్‌కు ఉచితంగా అందిస్తుంది. దాంతోపాటు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఓ కరపత్రాన్ని ఇస్తుంది. ఆ కరపత్రంలో..‘మేం కరోనాను అరిగించుకుంటాం! కరోనాను ఓడిస్తాం’ అనే సూక్తి బెంగాలీ భాషలో రాసి ఉంది. 
‘కరోనా వైరస్‌ మీద చైతన్యం తీసుకువచ్చి, స్ఫూర్తిని నింపడానికి దాని ఆకృతిలో సందేశ్‌, కప్‌ కేక్స్‌ను తయారు చేస్తున్నాం. దానిలో మేం ఎటువంటి లాభాన్ని ఆశించడం లేదు. ఇక్కడివారికి సందేశ్‌, కప్‌ కేక్స్‌ అంటే చాలా ఇష్టం’ అని ఆ షాపుకు చెందిన రాబిన్ పాల్ అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు గంటలు మాత్రమే షాపులు తెరిచి ఉండాలని బెంగాల్‌ ప్రభుత్వం నిబంధన విధించింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని