close

తాజా వార్తలు

Published : 18/03/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊగిసలాట ధోరణిలో మొదలైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా కరోనా భయాల కారణంగా నిన్న భారీగా దిగజారిన మార్కెట్లు ఈ రోజు ఊగిసలాట ధోరణిలోనే ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.33గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5 పాయింట్లు లాభపడి.. 30,584 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 8,979 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.96 వద్ద కొనసాగుతోంది.

యెస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సన్‌ఫార్మా, ఇన్‌ఫోసిస్‌, వేదాంత షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యాక్సిస్ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే, గెయిల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని