close

తాజా వార్తలు

Updated : 08/01/2020 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జగన్‌ను కలిసిన శ్రీకాకుళం మత్స్యకారులు

అమరావతి: పాక్‌ నుంచి విడుదలైన 20 మంది మత్స్యకారులు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులను సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన అనంతరం మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ...పాక్‌ నుంచి 20 మంది మత్స్యకారులు రాష్ట్రానికి వచ్చారని, మరో ఇద్దరు త్వరలో విడుదలవుతారని తెలిపారు. గత ఆరునెలలుగా సీఎం జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరిపారని, సీఎం ప్రత్యేక శ్రద్ధవల్లే మత్స్య కారులు విడుదలయ్యారన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల జీవనోపాధి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనువైన చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, జెట్టీలు నిర్మించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని