close

తాజా వార్తలు

Updated : 23/01/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎస్‌ అభ్యర్థన తిరస్కరించిన ఎస్‌ఈసీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎస్‌ఈసీని కోరారు. అభ్యర్థనను తిరస్కరించిన ఎస్‌ఈసీ సీఎస్‌కు లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిందని.. వ్యాక్సినేషన్‌, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్‌ సరైన వేదిక అని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఎన్నికలు పూర్తి చేయగలుగుతామన్నారు.

అయితే కాసేపట్లో అధికారులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌ కోసం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎస్‌, డీజీపీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. అయితే సమావేశానికి అధికారులు హాజరవుతారా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది.




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని