
తాజా వార్తలు
పంచాయతీరాజ్ సమ్మేళనంలో ఉద్రిక్తత
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సమ్మేళన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సర్పంచులు ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచి నిరసన తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సమ్మేళనం ముందు నేల మీద బైఠాయించి ఆందోళన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారికి నచ్చజెప్తున్నా వినకుండా సర్పంచులు తమ ఆందోళనకు కొనసాగించారు. డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇస్తేనే సమ్మేళనంలో పాల్గొంటామని వారు మంత్రులకు వెల్లడించారు. మంత్రి హామీతో కొందరు సర్పంచులు సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్ కలకలం
‘ట్రాక్టర్ల ర్యాలీలో మమల్ని చంపేందుకు కుట్ర’
Tags :