close

తాజా వార్తలు

Published : 21/02/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్ల గురించి కాదు..వాళ్లతో మాట్లాడండి: సచిన్‌

ఇంటర్నెట్‌డెస్క్: తన స్వీయ అనుభవాలు, విజయాల్ని పంచుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని దిగ్గజ క్రికెట్ సచిన్‌ తెందుల్కర్‌ కొనియాడాడు. ఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు కుంగుబాటుకు గురయ్యానని, సచిన్‌ సలహాలు ఎంతో మేలు చేశాయని కోహ్లీ ఓ కార్యక్రమంలో తన అనుభవాలు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీని అభినందిస్తూ యువత గురించి సచిన్‌ ట్వీట్ చేశాడు.

‘‘వ్యక్తిగత అనుభవాలు, విజయాల్ని పంచుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై ఎంతో గర్విస్తున్నా. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో యువత పరిస్థితిపై అందరూ అంచనా వేస్తున్నారు. అయితే వాళ్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప.. వాళ్లతో ఎవరూ మాట్లాడట్లేదు. వాళ్ల పరిస్థితుల్ని తెలుసుకుని కోలుకునేలా మనం సహకరించాలి’’ అని సచిన్‌ ట్వీట్ చేశాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని