close

తాజా వార్తలు

Published : 30/07/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీవారిని దర్శించుకున్న రష్యన్‌ మహిళ

తిరుపతి: ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి, ఇక్కడే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘ఈనాడు-ఈటీవీ’ కథనాలకు స్పందించిన తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి... తన ప్రతినిధులను ఎస్తర్‌ వద్దకు పంపించారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. సినీ నటుడు సోనూ సూద్‌ కూడా స్పందించారు. తనవంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది.

రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్‌(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్‌ దీపా వెంకట్‌ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్‌-తెలుగు, రష్యన్‌-హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో చిక్కుకున్న ఒలివియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.