close

తాజా వార్తలు

Published : 24/01/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డివైడర్‌ను ఢీకొన్న మిని వ్యాన్‌.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌: నగర శివారు ప్రాంతమైన హిమాయత్‌సాగర్‌ వద్ద బాహ్యవలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న మినీ వ్యాన్‌ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌తో సహా క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో డ్రైవర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..
తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు

మోసిమ్‌గాళ్లు..!
 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని