close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/04/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లారీని ఢీకొన్న అంబులెన్స్‌: ఒకరి మృతి

కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజి వద్ద ఇవాళ ఉదయం లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం..ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తి విషం తాగాడు. దీంతో అతన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఉగ్రవాయి స్టేజి సమీపంలోకి రాగానే అంబులెన్స్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఎల్లారెడ్డికి చెందిన విషం తాగిన వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.