close

తాజా వార్తలు

Updated : 24/01/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖలో పూల సోయగాల కనువిందు

విశాఖ: కొవిడ్‌ తర్వాత జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు. విహారయాత్రలకూ వెళ్తున్నారు. వారిని ఆకట్టుకునేలా పర్యాటక ప్రాంతాలు అందంగా ముస్తాబవుతున్నాయి. సందర్శకులకు నచ్చేలా రిసార్టుల నిర్వాహకులు వాటి రూపురేఖలు మార్చుతున్నారు. కనువిందు చేసే పూల సోయగాలతో రిసార్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్‌ సరికొత్త హంగులతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. విశాఖ సమీపంలోని సన్ రే రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పూల సొబగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నగర వాతావరణానికి భిన్నంగా హాయిగా కుటుంబంతో గడుపుదామని వచ్చే వారికి కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణంలో గడపడం ఎంతో బాగుందంటూ సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..

ఇవీ చదవండి..

కేటీఆర్‌ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్‌ చూశారా..?

6 రోజుల్లో 10లక్షల మందికి టీకా!




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని