close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/07/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎమ్మెల్సీ, మంత్రి పదవికి బోస్‌.. మోపిదేవి రాజీనామా

అమరావతి: ఎమ్మెల్సీ పదవికి వైకాపా నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ‌ రాజీనామా చేశారు. గత నెల 19న జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం మండలి ఛైర్మన్‌ ఆమోదించారు. దీంతోపాటు మంత్రిపదవులకు కూడా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడుతూ... ఏడాది కాలంలో ఎంతో సంతృప్తిగా పనిచేసినట్లు చెప్పారు. తన శాఖకు సంబంధించి ఏ రోజూ కూడా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. కౌన్సిల్‌ రద్దయ్యే వరకు మంత్రిగా కొనసాగినా అభ్యంతరం లేదని సీఎం చెప్పారని వెల్లడించారు. పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని చంద్రబోస్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్‌ సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై తనకు నమ్మకం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాల్సిందేనన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.