close

తాజా వార్తలు

Updated : 02/12/2020 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిత్ర వార్తలు

అమ్మకు ఏమైంది..?

అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. ఆమెకు ఏమైందో తెలియక బిక్కమొహం వేసిన ఈ చిన్నారిని చూస్తుంటే గుండె తరుక్కుపోకమానదు. హాజీపూర్-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఇన్నోవా, బోర్‌వెల్‌ లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరగ్గా.. ఆ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులే.


కొండ మండుతోంది

బద్దలవ్వడానికి సిద్ధం అన్నట్టు మండుతోంది కదూ ఈ అగ్ని పర్వతం. ఇండోనేసియాలోని లక్సంబర్గ్‌ ప్రాంతంలో మౌంట్‌ సమేరు ఆగ్నిపర్వతం నుంచి ఇలా లావా ఉప్పొంగుతోంది. ఇప్పటికే అధికారులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


హలో.. హాయ్‌!

గజరాజులు ఒకదానినొకటి హాయ్‌ చెబుతున్నట్లు ఉంది కదూ.! కంబోడియా దేశంలోని కులెన్‌ ప్రోమ్‌ టేప్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఆసియా సంతతికి చెందిన ఈ రెండు ఏనుగులు ఇలా తొండంతో ఒకదానినొకటి పలకరించుకున్నాయి.


తొంగి.. తొంగీ చూడమాకు చందమామ!

నిండు చంద్రుడు సరదాగా దాగుడుమూతలు ఆడుతున్నట్టు ఉంది కదా..! లండన్‌లోని షార్డ్‌ స్కై రాపర్‌ వెనుక ఈ దృశ్యం కనిపించింది.


ఆల్‌రౌండర్లు అదరగొట్టారు

ఆఖర్లో ఆకాశమే హద్దుగా హార్దిక్‌ పాండ్య, జడేజా చెలరేగడంతో భారత్‌ 302 పరుగుల భారీ స్కోరు సాధించింది. 152 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వారిద్దరూ ఆదుకున్నారు. 150 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు విరాట్ కోహ్లీ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు.


ట్రక్‌ ఎక్కిన ఇల్లు

మొత్తం ఇంటినే ప్యాక్‌ చేసుకుని ట్రక్కులో తీసుకెళ్తునట్టు అనిపిస్తోంది కదా! ఆర్మేనియా దేశ సరిహద్దులోని నాగొర్నో-కారాబాఖ్‌ ప్రాంతంలో ఉంటున్న కొందరు పౌరులు రష్యాతో ఆర్మేనియాకు కుదిరిన సరిహద్దు ఒప్పందం కారణంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇలా వేరే చోటుకు తరలిపోతున్నారు.


మీ తోడుగా..

నివర్‌ తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులనుద్దేశించి ప్రసంగించారు.


కోహ్లీ @12000

పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం ఆస్టేలియాపై వన్డే సిరీస్‌ ఆడుతున్న కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి అత్యంగా వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు.


వినూత్న నిరసన

రాష్ట్రంలో ఇసుక లేక, పనుల్లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా డిమాండ్‌ చేసింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. ఇసుకను బంగారంతో తూకం వేస్తూ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.


శరణార్థికి ఎంత ఇబ్బంది..?

టిగ్రే దేశ రాజధానిని ఇథియోపియా సైన్యం ఆక్రమించింది. దీంతో అక్కడి ప్రజలు శరణార్థులుగా మారి తమ సామగ్రి సహా సూడాన్‌-ఇథియోపియా సరిహద్దులోని నదిని దాటుతున్నారు. కొందరు తమ సామగ్రిని మోసుకుని వెళ్తుండగా ఓ వృద్ధురాలు రెండు ఆవు దూడలతో తన కుటుంబం కోసం ఎదురు చూస్తోంది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని