close

తాజా వార్తలు

Updated : 23/01/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికలు నిర్వహించాల్సిందే: పవన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కరోనాను బూచిగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం సరికాదన్నారు. వైకాపా నాయకులు ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌, జడ్జిలకు కులాలను అంటగట్టడం అన్యాయమన్నారు. చిన్న పొరపాటు జరిగితే జర్నలిస్టులపై బలమైన కేసులు పెట్టారు. వివేకా హత్య వంటి పెద్ద కేసులపై పోలీసులు దృష్టి పెట్టాలని పవన్‌ సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి..

అన్నా రాంబాబు ఎలా గెలుస్తారో చూస్తా : పవన్‌

ఎస్‌ఈసీ వ్యాఖ్యలు బాధించాయి: ఏపీ ఎన్జీవో




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని