close

తాజా వార్తలు

హైదరాబాద్‌కు బస్సులు లేవని ధర్నా

తెలంగాణ చౌక్‌: హైదరాబాద్‌ వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఒకటో డిపో ఎదుట ప్రయాణికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. రాత్రి 8.30గంటల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు బస్సులు లేవని, ఉన్న బస్సుల్లో కూడా ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఒకటో డిపో మేనేజర్‌ అర్పిత మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని, డ్రైవర్లు అందుబాటులో లేనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.