close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120027833 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Wu85zRrWjwc [video_short_link] => Wu85zRrWjwc [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-02-27 13:06:10.650403 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. చంద్రబాబు వాహనశ్రేణి వద్ద ఉద్రిక్తత

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వాహనశ్రేణి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖ విమానాశ్రయం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డుకొనేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఆయన వాహనాలను చుట్టుముట్టిన  వైకాపా నాయకులు వాటికి అడ్డంగా పడుకొన్నారు. దీంతో చంద్రబాబు వాహనశ్రేణి నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమైపోయి ఆయన వాహనానికి రక్షణ వలయంగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. వైకాపా లెక్కలు తేలుస్తా: చంద్రబాబు

ఉత్తరాంధ్ర పర్యటనలో వైకాపా లెక్కలు తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైకాపాకు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరే ముందు పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వడాన్ని తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కాలువలోకి కారు: ముగ్గురి మృతి

నల్గొండ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం దుంగ్యాల వద్ద కారు అదుపుతప్పి పీఎంఆర్‌పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడిని రక్షించారు. మృతులు పీఏపల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన ఓర్సు రఘు, అతని భార్య అలివేలు, కుమార్తె కీర్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఉత్కంఠ పోరులో అద్భుత విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివర్లో అమెలియా కెర్ర్‌(34; 18 బంతుల్లో 6x4) ధాటిగా ఆడినా కివీస్‌ గెలుపొందలేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘సైనేడ్‌ జాలీ’  ఆత్మహత్యా యత్నం

సైనేడ్‌ ఉపయోగించి ఆరుగురి ప్రాణాలు తీసిన కేసులో నిందితురాలు జాలీ జోసెఫ్‌ (47) ఆత్మహత్యకు ప్రయత్నించింది. కేరళలోని కోజికోడ్‌ పోలీసుల కథనం ప్రకారం... జాలీ తను ఉన్న జైలు గదిలో గురువారం తెల్లవారుజామున పదునైన వస్తువుతో మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అదే గదిలో ఉన్న మరో ముగ్గురు ఖైదీలు ఆ విషయాన్ని గమనించి వెంటనే జైలు వార్డెన్‌కు తెలియచేశారు. అధికారులు జాలీ జోసెఫ్‌ను తొలుత జిల్లా ఆస్పత్రికి.. అనంతరం కోజికోడ్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దిల్లీ హైకోర్టు జడ్జీ బదిలీ.. సాధారణ ప్రక్రియే

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ను బదిలీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు మార్చామని, ఇందుకు జడ్జీ నుంచి ముందస్తు సమ్మతి కూడా తీసుకున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చైనా, జపాన్ నుంచి భారతీయుల తరలింపు

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ప్రబలిన జపాన్‌లోని డైమండ్ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించారు. వీరిని ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం దిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ట్విటర్లో ప్రకటించారు. వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసిన జపాన్‌ అధికారులకు ధన్యవాదాలు, మరోసారి ఎయిరిండియాకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మక్కా యాత్రపై కరోనా ఎఫెక్ట్‌..!

కరోన ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి పవిత్ర మక్కాలోకి అనుమతులను నిలిపివేస్తున్నట్లు తాజాగా సౌదీఅరేబియా ప్రకటించింది. కరోనా వైరస్‌( కోవిడ్‌-19) ఇప్పటికే చైనాతో పాటు వివిధ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల సంఖ్య చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, యూరప్‌, ఆసియా, తూర్పు మధ్య దేశాల్లో మాత్రం  వేగంగా వ్యాపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 306, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.60గా ఉంది. 

10. ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఒంటరిగా వృద్ధురాలు



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.