close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024400 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => OraXMK8-GbU [video_short_link] => OraXMK8-GbU [created_by] => [created_date] => [modified_by] => 9823470 [modified_date] => 2020-02-20 12:54:43.951903 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజాకు నిరసన సెగ

ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజాకు అమరావతి నిరసన సెగ తాకింది. ఐనవోలు ఎస్‌.ఆర్‌.ఎం వర్సిటీలో ‘పరిశ్రమ-విద్య’పై ఏర్పాటు చేసిన సదస్సుకు రోజా హాజరయ్యారు. రోజా ఐనవోలు వచ్చిన విషయం తెలుసుకున్న మహిళా రైతులు వర్సిటీ బయట ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’, ‘భూములిచ్చిన రైతులు పెయిడ్‌ ఆర్టిస్టులు కాదు’ అంటూ నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మహిళల భద్రతే ప్రథమ లక్ష్యం: సజ్జనార్‌

హైదరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో హెచ్ఐసీసీలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... మహిళల భద్రతే ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘షీ టీమ్‌’ల ద్వారా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిన్నారుల కోసం ఏడాది పొడవునా ఆపరేషన్‌ స్మైల్‌ నిర్వహిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ముసుగు దొంగలు యూపీ ముఠావారేనా?!

అమీర్‌పేట్‌ అపరాజిత కాలనీలో నందితా కపూర్‌ నివాసంలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, పంజాగుట్ట పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠాగా భావిస్తున్నారు. నందితా కపూర్‌పై దాడికి ఉపయోగించిన సుత్తిని అక్కడే వదిలి బయటకు వచ్చిన కాసేపటికి ముసుగులు తీసేసి పంజాగుట్ట చౌరస్తాకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఓ ఆటోలో ఖైరతాబాద్‌ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నెల 16 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సోమవారం వినయ్‌ శర్మ జైలు గది గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు జైలు వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ముంబయిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని నాలుగు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు ఇ-మెయిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. లష్కర్‌-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినట్టుగా చెప్పుకొంటున్న వ్యక్తి వీటిని పంపాడు. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే బిట్‌కాయిన్లలో డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ట్రంప్‌ కోసం 70లక్షల మంది..సాధ్యమేనా..? 

భారత్‌ పర్యటనలో తను దిగే ఎయిర్‌పోర్టుకు.. మోతేరా స్టేడియంకు మధ్య 70లక్షల మంది ఉంటారని మోదీ చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా వాషింగ్టన్‌లో విలేకరులకు వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం విరుచుకుపడుతున్నారు. రోడ్‌షోలో పాల్గొనే ప్రజల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. ‘అహ్మదాబాద్‌ జనాభానే కేవలం దాదాపు 50-55లక్షలుంటే 70లక్షల మంది ఎక్కడినుంచి వస్తారు?’ అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చైనాలో తగ్గిన ‘కరోనా’ కేసులు

చైనాలో విజృంభించిన మహమ్మారి కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. నిన్న దేశవ్యాప్తంగా 394 కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ గురువారం వెల్లడించింది. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది. ఇదే సమయంలో బుధవారం మరో 114 మంది కొవిడ్‌కు బలయ్యారు. వీరిలో 108 మరణాలు ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. దీంతో కొవిడ్‌ మృతుల సంఖ్య 2,118కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. జవగళ్‌ శ్రీనాథ్‌ తర్వాత పుజారా

టీమ్‌ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఇంగ్లీష్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడేందుకు సంతకం చేశాడు. ఈ వేసవిలో గ్లౌసెస్టర్‌షైర్‌ జట్టు తరఫున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో చెప్పాడు. ఏప్రిల్‌ 12 నుంచి మే 22 మధ్య ఆరు మ్యాచ్‌లకు మాత్రమే ఆడనున్నట్లు పుజారా పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. జావేద్‌ అక్తర్‌ కంగనను బెదిరించాడు

ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఒకానొక సమయంలో కంగనా రనౌత్‌ను బెదిరించాడంటూ ఆమె సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా ఆరోపించింది. ‘ఒకసారి జావేద్‌ అక్తర్‌ కంగనను తన ఇంటికి పిలిపించుకున్నారు. హృతిక్‌కి సారీ చెప్పకపోతే ఊరుకోను అని బెదిరించాడు. అలాగే ఒకానొక సమయంలో సూసైడ్‌ బాంబర్‌గా నటించనన్నందుకు కంగనపై మహేశ్‌ భట్‌ చెప్పులు విసిరాడు. ఇప్పుడు వాళ్లు ప్రధానమంత్రిని నియంత అని అంటున్నారు. మీ ఇద్దరికి ఏమైంది?’ అని రంగోలీ ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ట్రంప్‌ విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్న కృష్ణ

 Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.